@ ఎం చేస్తావో @ నా గుండె గొంతు విప్పగానే పలికిన ప్రతి స్వరం నీ చిరునవ్వులాగా నా గుండె గోడలలో ప్రతి ధ్వనిస్తుంది. నా మనసు పరవశించగానే మల్లెపూవు లోని సుగంధం లా మదుర భావాల కవిత వెలువడింది ఆ కవితలోని ప్రతి పదం నీకర్పిస్తున్నాను. నా కనులు ఆరాటపడుతూ నిన్ను సొంతం చేసుకోవాలని నీ రూపాన్ని వాటిలో నిలుపుకున్నాయి ఆ కనురెప్పల వెనుక నీవుంటావు. నా హృదయం విశాల గగనం మెరిసే ప్రతి నక్షత్రం ఒక ఊహ ఆ నక్షత్రాల వెలుగు నీవు ఆ వెలుగులోనే నేను జీవిస్తుంటాను. ఈ కాంతిలో నా పయనం ఉజ్వలితం చేస్తావో.... మాటమార్చి ఏమార్చి నా కలలకు చిరు చీకట్ల వల వేస్తావో. _ కొత్త అనిల్ కుమార్ 20 / 6 / 2014 ( ప్రేమ కవిత _ 1999 )
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UnY4mu
Posted by Katta
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UnY4mu
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి