వసంతరాగం // శివపురపు శారద చల్లటి గాలులు అల్లరిగా జల్లిన పుప్పొడి పూతలు వసంతుని ఆగమనం ముందుగా తెలిపిన దూతలు వనకన్య మేన రెపరెపలాడిన కొ త్తాకుపచ్చని కోకలు విరబూసిన విరజాజి మల్లె కొమ్మల గుసగుసలు మేలి వన్నెల సుమము లొల్కిన లేత సిగ్గులు చిరుగాలులతో చేరి చేసిన ఉషారైన షికారులు రారమ్మని పిలచిన కమ్మని పూల పరిమళాలు ఝుంఝుమ్మని వాలిన మ త్తెక్కిన తుమ్మెదలు తియ తియ్యగ ఊరిన లేత తేనెల విందులు కాదన లేదెవ్వరు రస రమ్యమైన పొందులు నిదురలోని పర్వతరాజుని మె త్తగ తాకిన మేఘాలు క్షణక్షణం మారిన వయ్యారి భామల నాట్యభంగిమలు ఆకుల ఒడిలో గారాలు పోయిన హిమబిందువులు గిలిగింతలు పెట్టిన నులి వెచ్చని అరుణోదయాలు పెద్ద కొండల చిన్ని గుండెలు హ త్తుకున్న పొగ మంచులు పొద్దు పొడిచినా సద్దు చేయక నిద్దుర పోయే బద్ధకాలు చిలిపిగ సూరీడు కెదురునిలిచి, దరిచేరగనే కరిగే తెలిమబ్బులు లేత చిగురుల రుచులు మరిగిన కోయిలమ్మలు గొంతులు విప్పి పాడగ లలితప్రియ రాగములు చిరు తాళం వేసిన పక్షుల కిలకిలా రావములు గోరొంకలు జంటలుగా పాడుకున్న యుగళగీతికలు నింగిఅంచున ఠీవిగ నిల్చిన వెండి వెలుగుల మబ్బుతునకలు కవి హ్రుదయం నుంచి అలవోకగ జారిన పద మాలికలు వీనుల విందుగ వినిపించే బహు పసం దైన రాగడోలికలు రేరాణి విరివిగ వెదజల్లిన గమ్మ త్తైన పూల సువాసనలు నిండు పున్నమి జాబిలి సభలో వెండి వెన్నెల జల్లులు తళుకు తళుకు తారలన్నీ మరువక హాజరైన రేతిరిలు అల్లరి గాలులు తాకగ మ త్తుగ ఊగిన లేత కొమ్మలు గలగల పారే సెలయేరుల తడిసిన పూల రెమ్మలు ముదురు కొమ్మల మ్రుదువుగ పెనవేసిన పసిడి లతలు పిల్లంగ్రోవి మౌనంగా మ్రోగించిన ప్రియమోహన రాగాలు ఎవ్వరికోస మై విరిసి మురిసెనీ ముద్ద మందారాలు మన సైన వారినెవరి నైనా హరించే శుద్ధ సింగారాలు కొసరి కొసరి వినిపించిన కుహు కుహూ రాగములు విరహాన వేసారిన చిలుకమ్మలు వేగిరపడిన విధములు ప్రకృతికన్య పరవశించి పాడిన స్వాగత గీతాలు మేళతాళాలతో విచ్చేసిన నవ నవీన వసంతాలు మరల మరల మనసులలరించే వార్షికోత్సవాలు… 21/06/2014
by Sharada Sivapurapu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uNvMg9
Posted by Katta
by Sharada Sivapurapu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uNvMg9
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి