పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జూన్ 2014, శనివారం

ఇట్లు మీ శతఘ్ని కవిత

శతఘ్ని / కొత్త బాధ - పాత ఊరట ...!! ***************************** ప్రశ్నలతో రోజుని మొదలుపెట్టే ప్రతి మనిషినీ .... ఏం చేయడం ?? అనే మరో ప్రశ్న ఏదోలా సమధానపరిచేందుకు ప్రయత్నిస్తుంది ... సగం పుట్టిన సమాధానాలు సాష్టాంగ పడ్డా గుచ్చే ప్రశ్నలు గుండె గూటిని వదిలెళ్ళవు పూటకో రకమైన బాధ కొత్త రంగు పులుముకుంటున్నా అంతా దైవాధీనం అనే చిన్ననాటి ఊరటతోనే చెలిమి చేస్తాడు మనిషి .. ఎదిగే వయసు ఎంత నిలదీసినా ఏం లాభం? గాలిలేని చోట గాలిపటాన్నెగరేయాలనే చంటిపిల్లల గారాబం మనిషి మానుకుంటేనా?? తనకి తానుగా తగిలించుకునే దెబ్బలనుండి అంత తేలికగా కోలుకుంటేనా?? అలసిపోని ఆశ ఆకలి తీర్చలేక మనిషి అడ్డదారులెన్నో తొక్కుతాడు ఆయువు తీరేదాక ఆ మార్గంలోనే ఆస్తినెంతో కూడబెడతాడు వదిలితే తిరిగి పొందలేను అనే వాటిని వదిలిపోలేడుగా మనిషి ? అందుకే సమాధానపడదాం బ్రతుకంతా కొత్త బాధే పాత ఊరటే ....!! 21/06/2014.

by ఇట్లు మీ శతఘ్ని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRANiy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి