తీరని దాహం _____________ - మోని శ్రీనివాస్ ఎవరన్నారు కవిత్వమంటే మాటలని అవును... కవిత్వమంటే కేవలం మాటలే కాదు మౌనం కూడా! సృష్టిలో... అందమైన ప్రతిదీ మౌనంలోంచే జనించినట్లు కవిత్వం కూడా మౌనంలోంచే వికసిస్తుంది! మహోన్నతంగా పరిమళిస్తుంది!! కిటికీ రెక్క తెరవగానే చటుక్కున చొచ్చుకువచ్చే వెలుతురు కిరణంలా నిశ్శబ్దం దోబూచులాడుతున్న వేళ మదిలో... ఓ ఆలోచన తళుక్కున మెరుస్తుంది అదేమిటో చిత్రంగా... అప్పుడు మౌనం కూడా ప్రతిద్వనిస్తుంది! మహోజ్వలంగా వెలిగిపోతుంది!! అపరిచిత పదాలు కూడా ఆత్మీయంగా దరి చెరుతాయి ఆక్వేరియంలొని చేపపిల్లల్లా అలవోకగా కదలాడతాయి పదాల రెమ్మలు ఒక్కొక్కటే విచ్చుకుంటూ అందమైన కవితాపుష్పం ఆకృతి దాల్చుకుంటుంది భావాల ఝరి ఒక్కసారిగా పురివిప్పుకుంటుంది కాగితంపై కలం పరుగులు తీస్తూ కవిత్వమై ప్రవహిస్తుంది. నిజంగా... ఇదేనా కవిత్వమంటే? బహుశ... కవిత్వం దేనికీ నిర్దారణ కాదేమో... అదొక అందమైన స్వప్నం! నిర్వచనానికందని ఓ నిత్యవసంతం!! చిన్నప్పుడు పూలచుట్టూ తిరిగే సీతాకోకచిలుకను పట్టుకోవాలనే పిచ్చి తాపత్రయంలాంటిదే ఇవాళ నాకు కవిత్వమంటే... నిజమే.. కవిత్వమంటే ఓ నిరంతర స్వప్నం! అది నాకెప్పుడూ ఓ తీరని దాహం!! -మోని శ్రీనివాస్ (21-02-2013)
by Srinivas Moni
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UY3RzU
Posted by Katta
by Srinivas Moni
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UY3RzU
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి