చుండూరు దళిత స్వరం కులం లేదు కులం లేదు అని నువ్వంటుంటే ఈ చుండూరు ఎక్కడిది ఈమారణహోమం ఎప్పటిది కులం హలాహలం అంటాడు ఇంకొకడు అంతేలే అది నిన్ను కాదుగా మింగింది దళితుడైన నన్నేగా మింగింది మనుషులంతా ఒకటేగా ఆపు నీ నీతి వాక్యాలు ఒక్కటైతే ఒకే రక్తమైతే మా రక్తాలు చిందుతున్నాయి మీ రక్తాలు నరుకుతున్నాయి చేతగాని నీతులెన్నో చెప్పరాని ధర్మాలెన్నో కళ్ళ ముందు మృగాలన్నీ కసితీరా వేటాడుతుంటే కళ్ళ ముందు సాక్ష్యాలెన్నో తల్లకిందులవుతుంటే నీ సమానత్వ బోధలు నీ మనుధర్మ వాక్కులు వీలుంటే పోరాడు కులతత్వాన్ని చెండాడు మీ మసి పూసే మాటలన్నీ మీ ముద్దు ముద్దు రాతలన్నీ కులం విడిచిపెట్టుకొమ్మని మమ్మల్ని బానిసలై చావండని అంతేకానీ సమానత్వం మీ ఆశయమూ కాదు మానవత్వం మీ మతమూ కాదు మీ మర్యాదలు మీ మేధస్సులు మీ అంతస్తులు అహంకారాలు అలంకారాలు అన్నీ కులమైతే కంటికి రెప్పలా మిము కాపాడుతుంటే కులం పోవాలని మీరు చెప్పే నీతులు మాయమాటలు మమ్మల్నీ మా పోరాటాన్నీ మా ఆత్మగౌరవాన్నీ అంతం చేయాలని మాకు తెలుసులే
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnBCBX
Posted by Katta
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnBCBX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి