పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఏప్రిల్ 2014, గురువారం

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత - 9 ----------------------------------------- మనకు సిగ్గులేదు - - - - - - - - - - - - - - ఆశారాజు రెండు కళ్ళుపోయి అంతా స్పష్టంగా కనబడుతోంది అంజనం వేస్తే అరచేతిలో హన్మంతుడు కనపించినంత స్పష్టంగా మాయల ఫకీరు గుహలో మంత్ర దర్పణం చూపించే రాజకోట రహస్యమంత స్పష్టంగా కళ్ళుపోయింతర్వాత ఇంత నిజం బయటపడుతోంది ఓ తల్లి దాహానికి నీళ్ళడిగితే నోట్లో పెట్రోలు పోసి నిప్పంటించటం అతి సమీపంగానే కనబడుతుంది అమాయక స్త్రీలను చెరిచి ముక్కలు ముక్కలుగా కోసింది రక్తమంత నిజంగానే కనబడుతోంది కత్తితో గర్భిణి కడుపు చీరి గాల్లో పిండాన్ని ఎగరేసింది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది యాసిడ్‌ చల్లిన శవాలు మనవే బూడిదయిన గృహాలు మనవే నమస్కరించండి శవాలకు నమస్కరించండి బూడిదకు నమస్కరించండి పాదుకల్ని తలమీద మోసుకెళ్తూ కళ్ళల్లో కుంకుమా పసుపూ చల్లినపుడే ఈ దేశం గుడ్డిదయ్యింది మనకు సిగ్గులేదు మనుషుల్ని చంపే రథయాత్రలు తిలకిస్తున్నందుకు నిజంగా షెరం లేదు మిత్రుని గాయం స్పష్టంగా కనబడుతోంది నా గాయాన్ని, మిత్రుడు దీనంగా చూస్తున్నాడు ఇద్దరి మధ్యన పావురాలు ఎగురుతున్న శబ్దం బస్సు టైమవుతోంది మళ్ళీ రెండు చాయ్‌లు తెప్పించుకున్నాం (మిత్రుడు కమల్‌ కామి తో నేను, నాతో కమల్‌ కామి పంచుకున్న బాధ) (అముద్రిత దీర్ఘకవిత 'రంగేలికిటికి' లోంచి) (GUJARAT GAAYAM -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tGxgeo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి