శేషప్రశ్న రావెలపురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ నీటిచినుకుకోసం నిరంతరం ఎదురుచూసే నెర్రెలుగొట్టిన నేలలా నా హృదయం ఆమె రాకకోసం అన వరతం పరితపిస్తున్నది చివురుజొంపాలతో సయ్యాటలాడేందుకు తయారయే పచ్చని పైరు పొలంలా ప్రతిక్షణం నాకళ్ళెదుటన తిరుగాడిన ఆమె నిత్య సుమంగళిరూపం నన్ను విషాదాల అంచున పరదాలమాటున కప్పెట్టి పదే పదే దోబూచులాడుతూ దొరకబుచ్చుకోడానికి వీలుగాకుండా అదృశ్యమై అలరిస్తున్నది ఆపసోపాలు పడేలా ఆటపట్టిస్తూ అందకుండా పరుగెడుతున్నది. విధిచేతిలో కీలుబొమ్మలంగదా అందుకే ఇలా నా జీవన సరళిని అస్తవ్యస్తంజేసి ఆ పరాత్పరుడు ఈ ప్రహేళికను రచించి గొప్ప నాటక కర్తగా ప్రశంసలనం దుకునే ప్రక్రియలో మునిగి తేలుతూ మానవాస్తిష్కాలను తొలిచేస్తూ మరో రచనను విజయవంతంగా రూపొందించేదుకు సమాయత్తమవుతూ సందడిజేస్తూ సాగిపోతున్నాడు అవహేళన లేమీ అడ్డుపడకుండా జాగ్రత్త వహిస్తున్నాడు మనిషేమో విధి లిఖితమనుకుంటూ కన్నీళ్ళను కడలిలా పేర్చుకుంటూ శేషజీవితం నిశ్శేషంచేసుకుంటున్నాడు సదసత్సంశయంలో ఊగిసలాడుతూ జీవనరధాన్ని కాలానుగుణంగా మనసును మరల్చుకుని సాలోచనకు ప్రతిరూపంగా సాగిస్తున్నాడు ************************************************************02-04-2014
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s4ABmF
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s4ABmF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి