పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఏప్రిల్ 2014, గురువారం

Uday Kumar Alajangi కవిత

ఆలోచించు ---- ఆలోచించుకోనీయ్ // అలజంగి ఉదయ కుమార్ // ప్రతి ఒక్కడికీ ఒక ఆలోచన ఉంటుందని ఏది మంచో ఏది చెడ్దో ఏం చేస్తే బాగుంటుందో ఏది చేయకూడదో పద్దెనిమిది సంవత్సరాలు నిండాయంటే రాజ్యాంగం వాడికి స్వంత ఆలొచన వస్తుందని వాడిని నడిపించేవాడిని ఎంచుకోగలడని ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని ఇస్తే మీ ఆలోచనలు వాడిపై రుద్దాలని మీకు అంటుకున్న కులగజ్జిని, మత దురాహంకారాన్ని వాడికి అంటించాలని ఎందుకీ విశ్వప్రయత్నం ప్రచారం చేసుకో ప్రలోభ పెట్టకు నీ ఆలోచనలే అందరూ నమ్మాలంటే తోక ఊపుకుంటూ డూ డూ బసవన్నలా నీ వెంట నడవాలంటే తప్పని సరిగా ఇది ఫాసిస్టు తత్వమే అహం తలకెక్కిన రాజ్యంగ ఉల్లంఘనే ప్రజాస్వామ్యమంటే నీ కొక్కడికే కాదు ప్రతి ఒక్కడికీ స్వేచ్చ ఉంటుంది ఎవడి ఆలోచన వాడిది ఆలోచించు ---- ఆలోచించుకోనీయ్

by Uday Kumar Alajangi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mBa4cU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి