పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఏప్రిల్ 2014, గురువారం

Ravela Purushothama Rao కవిత

కవిసంగమం ----------------------------రావెల పురుషోత్తమరావు అంతా కవిత్వమే!! అందుకు సందేహమెందుకు? అడవి బాటను పట్టి చెట్టుమీద నిలిచిన పిట్టపాట కూడా కవిత్వమేగదా! నగరం నడిమయాన కళ్ళులేని కబోదినంటూ ఇల్లిల్లూ తిరెగే చిరుగుతూ దాపురించిన యవ్వనాన్ని చిరుగు బట్టలమధ్యన దాచుకోలేని భిక్షుకి వేదనా భరితపు రోదనా, కవిత్వ హేతువై పోదా? చివురుజొంపాల తలలనూపే పైర గాలి పాడే గుస గుసల రెపరెపల మధు గీతం కవిత్వమే కాకుండా పోతుందా? నాట్లు వే సే టప్పుడు వరికోతలరోజు శ్రామికలోకం పాడే స్వేద గీతమూ కవిత్వమేగదా? పేదవాడి బాగును పట్తించుకోక తన స్వార్ధమే తనకు రక్షనుకునే ధనిక స్వామ్యంపై తిరగబడుతూ అరిచే కేకల్లో కవిత్వ వాసన కనలేమా? కాగితాలను ఖరాబు చేసే షరాబుల అల్లికలేనా కవిత్వమంటే? కవిత్వ సాధన ఒక యోగం--డశదిశలా పొడసూపే దాని పరిమళ భరితంపు సువాసనలను కనిపెట్టలేని నాడు కనపడని విన పడని ఆఘ్రాణింప నలవిగాని వాళ్ళెందరుండీ యేమి ప్రయోజనం? కవిత్వానికి కాలం చెల్లిందనే కాకమ్మ కబుర్లకే పరిమితమై కొరగాని వాళ్ళలా కాల గర్భంలో కలిసిపోయేందుకు తప్ప యేమి ప్రయోజనం? 03-04-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3LF09

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి