పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఏప్రిల్ 2014, గురువారం

Padma Arpita కవిత

పెద్దమనిషయ్యా.. ఏంటో ఉండుండి నాలో అనుకోని ఈ మార్పు!? అమాయకత్వం నుండి అంధకారంలోకి వచ్చి అన్నీ స్పష్టంగా చూసేసి అర్థం చేసుకున్నట్లు రాబంధులన్నీ రామచిలకలై రా రామ్మన్నట్లు కుళ్ళుపై పన్నీటి కళ్ళాపి చల్లి శుభ్రపరిచినట్లు.. ఎందుకో నాలో సుడిగుండాల ప్రశ్నల కూర్పు!? జవాబులు తెలిసినా చెప్పకూడదంటూ నొక్కేసి గుంబనంగా బ్రతకాలని పాఠాలు వల్లిస్తున్నట్లు అసభ్యత అర్థం కాకపోతే అంతా సభ్యతన్నట్లు నలుపైతే మచ్చ కనపడదని ఇష్టం అనేసినట్లు.. ఎక్కడిదో నాలో నాకే తెలియని ఇంతటి నేర్పు!? తీరని సమయంలో తీరిగ్గా ఆలోచిస్తే తెలిసింది ఇన్నాళ్ళకి జ్ఞానం పెరిగి పెద్దమనిషి అయినట్లు లేని దర్పం నాకబ్బి కొత్తఛాయ ఏదో పెరిగినట్లు వెసులుబాటుకై వెలగాలని ఎవరో ఉసిగొల్పినట్లు.. పద్మార్పిత.. 3rd March 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3i2OM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి