చల్లా గౙల్-10/ Dt. 27-4-2014 తల్లిలేని పేద బ్రతుకని చెప్పుకుంటాను కమ్ముకున్న బతుకు వెతలను విప్పుకుంటాను చెట్టు క్రింద మట్టిలో నే నిదురపోతూనే ఆరు రుతువుల రంగు దుప్పటి కప్పుకుంటాను తల్లి రెక్కల మాటునుండి గువ్వ చూస్తుంటే అమ్మ ఒడిలో హాయి ఎంతో చెప్పమంటాను గడ్డి పువ్వూ అమ్మ ఉందని మురిసిపొతుంటే అనాధకంటే నీవె గొప్పని ఒప్పుకుంటాను దొరలబాబుల డాబులింక చెల్లవోయి "చల్లా" వెట్టి చాకిరి చెయ్యమంటే తప్పుకుంటాను
by Rambabu Challa
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pDOpWB
Posted by Katta
by Rambabu Challa
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pDOpWB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి