వికృతి ****** ప్రకృతి మోడువారిన క్షణాన నా కంట కారేది నీరేనని మురిసిన మనసు ఆ చుక్కలని పట్టి ఒక మొక్కకన్న నింపలేనా కడుపునని రగిలిన గుండె ఎండిన చర్మం పగిలిన కాళ్ళు ఆరిన చమట రాలిన ఉప్పు ! ఇలా మానవులు హహాకారాలు చేసి కార్చిన నీళ్ళను బిందెలో నింపి ప్రకృతి పాదాలను తడపినా కరుణించని తల్లి కసాయి సూరీడు ! ఎడారి నడకన ఎండమావుల పలకరింపులు క్షణానికైనా మదిలో సంబురం ! బొగ్గుల కొలిమిలో బతుకు నడవక బూడిదలో దాగిన ఆశ ! చేసిన పాపము చెడని పదార్దం చినుకు జారక ముందే మదిని తెరచి దాచుము విత్తు కొనజేరిన జీవనాడికి పచ్చని పందిరి అల్లుము మొద్దు ! కృష్ణ మణి I 27-04-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2lNBf
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2lNBf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి