నిశీధి |Trauma _ ఒకానొక అభౌతిక గాయం | వేకువలా అవెక్కడున్నాయి ? మనసులన్ని కృష్ణబిలంలా చీదరపు దారుల్లో నిరంతరం శూన్యమయిపొయాక బలమయిన వేటగాళ్ళ చేతిలో చిక్కిన చలిచీమల్లా సహజన్యాయాలకి న్యాయం ఊసే ఎరగని సామాజిక న్యాయాలకి మధ్య నలిగే ఆత్మలు అచేతనత్వపు అంచులలో కొనఊపిరికోసం పోరాడుతూ ద్వైత్వం కి అద్వైతం కి మధ్య నలగుతున్న సన్న పోగులు పట్టుకొని కామోద్రేకాల కహానీ అర్దం చేసుకుంటూ పగన్ జీవితాలని పంచనామాలు చేస్తూ నిజాలు చర్చించలేని నిస్సహాయాత్వాన్ని వెలగపండులా మింగుతూ రెక్కలు తెంచుకొని ఫిజిక్స్ కి మెటా ఫిజిక్స్ కి మధ్య ఊయలూగుతుంటే మిగిలింది అంతా నిశ్శబ్దమే .... అనైతిక హృదయాలను ఖాళీ విషాదాలను ఎంత తవ్వి చూసినా అవే శిధిలాలుగా మిగిలిపోతూ మరోసారి రియాక్షన్ లెస్ రిఫ్లెక్షన్ లు ప్రసరిస్తూ మరిన్ని పార్ధివ శరీరాలను ధరిస్తూ అజ్ఞానపు వికారాల అలసత్వం తో వెయ్యిన్నొకటో సారి కూలబడుతూ నిశీ !! 27/04/14
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nRcMLR
Posted by Katta
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nRcMLR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి