మృగమూ.. దాని సేవక మందా.. - - - - - - - - - - ఇపుడంతా మృగమాయలో ఉన్నారు.. తరాల నుంచి పోతపోసుకున్న బానిస మనస్తత్వం కదా- మనిషి రక్తం తాగి బలిసిన జంతువునే మృగరాజును చేయాలనే తపన.. మృగం సకిలిస్తున్నా జూలు విదిల్చినా పంజాలు చాపినా జువాల మంద కేరింతలు కొడుతున్నది గుహలోని అస్తిపంజరాల్లో అభివృద్ధి యాంటినాలు కనిపిస్తున్నాయట! మిగిలిన కళేబరాలకు ఆశపడే తోడేళ్ల మంద ఇప్పుడు జోరుమీదున్నది బొక్కలకు ఆశపడే కుక్కల మంద కాచుకుని ఉన్నది మందలు సరే..! తలలు నెరిసిన మేధావితనం మంద బుద్ధులవడమే చిత్రం ఎర్రెర్రని చైతన్యం వి'వర్ణ'మవుతుండడమే విషాదం కలం యోధులంతా 'జీ హుజూర్ ' కొట్టే కాలమొచ్చె అప్రకటిత శాసనకర్తలంతా వీలునామా రాసుకుంటున్న రోజులొచ్చె ప్రమాదాన్ని పసిగట్టి కాకులు కావుకావు మంటున్నా కోకిలలు ఖూనిరాగాలు తీస్తున్నాయ్ గద్దలు సంచరిస్తుంటే పావురాలు బెదిరిపోతున్నాయ్ ఎంత కాని కాలమొచ్చె..! చంపుడు పందెం ఆటంటే పడి చస్తున్నది మంద ఇక లాభం లేదు.. సైతాన్ గుహలోకి పోకుండా కొంకిరి కట్టెతో మంద కాలు గుంజాల్సిందే.. నీలి నీలి దారుల్లోకి మర్లేయాల్సిందే.. * (పత్రికలు అచ్చేయని కవిత)
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liHRZ8
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liHRZ8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి