అన్వేషి // వాడు వెళ్ళిపోయాడు... // వాడు వెళ్ళిపోయాడు... ఈ మజిలిలో కొన్ని క్షణాలను జ్ఞపకాలుగా మార్చేస్తూ... ఇకపై కొన్నిఅడుగులలో నన్నొంటరిగా వదిలేస్తూ... వాడు వెళ్ళిపోయాడు నా భావాలపై కొన్ని సిరాచుక్కలు జల్లుతూ... నా రేపటిపై కొంత నిరాశలను అద్దుతూ.. వాడు వెళ్ళిపోయాడు... విడిపోతామనే కలని నిజంచేస్తూ... విడిపోయామనే నిజాన్ని కలతగా మారుస్తూ... వాడు లేకపోతేనేం??? ప్రశ్నించాను మనసుని... ఇకపై మన మేడమీద వెన్నెల నా ఒక్కడి గ్లాసులోనే కురుస్తుంది.. ఇకపై నా యాష్‌ట్రే సగమే నిండుతుంది.... కొన్ని సాయంత్రాలు నన్ను ఒంటరిగా నడిపిస్తాయి... కొన్ని ప్రదేశాలు నా ఒక్కడితోనే సంభాషిస్తాయి... అవున్నిజమే...వాడెళ్ళిపోయాడు అయితేనేం... తనలాగ నేను మారిపోయాక, తనలా మారిన నన్నొదిలి ఎంత దూరం వెళ్ళగలడు ??? ఎక్కడో దూరంగా అస్పష్టంగా వినిపిస్తోంది " యే దోస్తీ హం నహీ ఛోడేంగే...". కొన్ని పదాలని దూరం మింగేసినట్టుంది.. ఇక్కడ నేను కొన్ని క్షణాలను బూడిద చేస్తున్నాను సిగరెట్ పొగతో రింగులొదులుతూ.. -09 మార్చ్ 2014
by Sai Anveshi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fdNYMi
Posted by Katta
by Sai Anveshi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fdNYMi
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి