చంద్రశేఖర్ వేములపల్లి || ఆకాశం చూరు క్రింద || నా ఏడుపు వినిపిస్తుంది కదూ! ....................... నిజంగా నిర్లక్ష్యం కాకపోతే .... ఎంతో ముఖ్యమూ, ప్రాముఖ్యమూ లేకపోతే ఈ ప్రపంచంలో ఎందుకు ఈ రక్త స్రావము? ఎందుకు శాంతిపై ఈ అనాశక్తత!? .......................... నేను, ఈ ప్రపంచాన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పుకోగలను. కానీ, అలా చెప్పడంవల్ల గాయం తగ్గి నొప్పి మాయం కాదు, మనశ్శాంతి దొరకదని తెలుసు. అందుకే, ప్రతి రోజూ ప్రార్ధిస్తున్నాను .... దయ కోసం సుమ సుఘందాలు వర్షించినట్లు నా కన్నీళ్ళు .... నా ఆత్మను చిల్లులు పొడుస్తూనే ఉన్నా, ...................... ఆ సూర్యుడు ఏమయ్యాడో? ఆ వెన్నెల రేడు, ఆ నక్షత్రాలు ఏమయ్యాయో? ....................... నేను, ఇంటి పైకప్పుపై కూర్చుని, జారి క్రిందపడ్డ వివేకము, రెక్కలూ లేని ఒక నీచజాతి పక్షిని. పాదరక్షలలో గులక రాయిలాంటి వాడిని. దారి లో కాళ్ళకు అతుక్కుపోయే మెత్తటి దూళి లాంటి వాడిని. రక్షింప దగని పాపాత్ముడ్ని! .................... పాడేందుకు పాట, తోడూ లేని, ఒంటరి పక్షిని .... నేను ఏమీకాని, ఏమీలేని శూన్యం పదాలే ఆస్తిగా ఊపిరిలేనట్లు వీస్తున్న గాలికి వ్యతిరేకంగా ఈకలు ఊపుతున్న .... ఒక నిట్టూర్పును. ............................. అదిగో వినిపించే ఆ ఏడుపు నాదే! ఆకాశం నుంచి రాలుతున్న ఆ వర్షపు చినుకులు సంకుచిత మానసిక స్థితి లో కొట్టుకుంటున్న ఒక సామాన్యుడి కన్నీళ్ళు అవి. నీరులా, విషాదం లా ఈ ప్రపంచాన్ని తడిపేస్తూ, ...................... ఆ ఏడుపును చూడకుండా దృష్టి మరల్చుకోలేవు. నీవు మూయలేవు .... నీ ఎద కిటికీ తలుపులు తుడిచెయ్యలేవు .... ఈ నా కన్నీళ్ళ తడిని, .................... నేను ఏడ్చాను . ఒక నది లా .... ప్రతి రోజూ చీకటి రాత్రుళ్ళను తడిచేస్తూ .................... నేను ఏడుస్తున్నాను ఎవరి ఓదార్పూ దొరకని ఒక పసిబాలుడిలా ........................ నేను ఎడుస్తూ ఉంటాను .... ఎవరూ పట్టించుకోరని తెలిసీ నన్నూ, నా ఏడుపునూ తొలకరి వర్షానికి తడిసిన మట్టివాసననూ. 09MAR14
by Chandrasekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O8VvRK
Posted by Katta
by Chandrasekhar Vemulapally
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O8VvRK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి