పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మార్చి 2014, ఆదివారం

Raghava Raghava కవిత

"నెగడు"( 2-3-14 ఆదివారం ఆంధ్రజ్యోతి లో వచ్చింది) "నెగడు" ….. మంటని ఎగదోయడమే మన పని మంటలార్పమంటూ మాటలు చెప్పే వాళ్ళు కొంపలార్పుతున్నారని నా భావన- ఊడల్ దించుకుంటూ రాక్షసవృక్షం పచ్చదనమంతా మింగేసి బలిసిపోతుంటే ఎలా ఉంటాం మౌనంగా మన గూళ్ళలో మనం ముడుక్కుని మన ఫైళ్ళలో మనం ఇరుక్కుని అటూ ఇటూ కాకుండా ’మధ్య’తరగతి గిరి గీసుకుని ఎలా ఉంటాం స్తబ్దంగా...? . . . -రాయ్యా రా! ఒక పుల్లో పుడకో పాటో పద్యమో కధో వ్యధో తీసుకురా ఏదో ఒకటి నీ వంతుగా వెయ్ మంటలో వెయ్ మంటను ఎగదొయ్ చితుకులేరు పోగుబెట్టు గియ్ పుల్లగియ్ -పైకెగిసే కనకాంబరాల ఫౌంటెయిన్ ఇపుడు మంటంటే ఒక మహోజ్వల సౌందర్యం! నయగారాలూ నంగిమాటలూ సుభాషితాలూ నీతిపద్యాలూ మర్యాదలూమప్పితాలూ మంటకు నప్పవు . . .చూడు ఎలా ఉంది మంట వీరుల గాయాల నెత్తుటి పంట ఆ రంగు ఎక్కడిది చెప్పు కడుపులెండుతున్న తమ్ముళ్ళ కళ్ళది గదూ.. వెతలోడుతున్న చెల్లెళ్ళ పిడికిళ్ళది గదూ -గళమెత్తిన చెమటచుక్కల గానం ఇపుడు మంటంటే ఒక మహాయుద్ధనాదం! . . . కొందరుంటారు కావాలని కళ్ళూ చెవులూ మూసుకుంటారు ఉదయం జాడను గుర్తించలేక ఉసూరుమంటారు తమకు చీకటయ్యిందని సూర్యుడు మరణించాడంటారు ..పట్టించుకోకు వాళ్ళను నిన్ను గూడా నిద్రబుచ్చుతారు- రా! మంటను గనగనమనిపించేదేదో ఒకటి మనవంతుగా తెద్దాం వేద్దాం మంటలో వేద్దాం మంటను ఎగదోద్దాం శివుడాఙ్న ను ధిక్కరించే చీమలకు జై కొడదాం- ..విరబూసిన మోదుగుపూల వనం ఇపుడు మంటంటే ఒక మహోద్రేక పరిమళం.. -----రాఘవ 9-3-14

by Raghava Raghava



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k5kmBd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి