జవాబులేని ప్రశ్న గుబురు పొదలాంటి రాత్రి చీకటి ముళ్ల మధ్య ప్రవహించే నెత్తురు కూడా పగటి వెలుగు లేక చచ్చిపోతుంది మాటల వడగళ్ళకు పంటచేను కుళ్ళిపోతుంది పచ్చికొమ్మలపై ఎండుటాకులా ఆత్మ ఎడారిలాంటి శరీరంపై చెమటవానగా కురిసేదెప్పుడు? ప్రతిబింబాల అద్దంలో రంగులన్నీ కడిగేసి తెలుపేదో తేల్చుకుందాం ఇంద్రధనుస్సు నెగడులో అనుబంధాల చలికాగుదాం ఎండవేడి మాటువేసిందని చల్లని బాటకు తెలియదు బారులుతీరిన చెట్లేగా గాడ్పు దెబ్బలు తినేది ప్రవహించే గాలి కెరటాల్లో ఈదుతున్న చేపల్లా ఇళ్ళల్లో దీపాల రెపరెపలు చీకటి మత్తెక్కిన నగరం నడక తడబడుతుంది కలలకోసం ఎదురుచూస్తు మేలుకున్న నిద్రదేవి నేలపైన తెల్లారింది మనసుల్లో చీకటి ఉదయించింది ప్రశ్నల దుస్తులు తొడిగి వీధుల్లో నడుస్తున్నాం జవాబులు భేతాళుడిలా చెట్టు దిగి రావడం లేదు.
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c1QuG9
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c1QuG9
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి