ఒక ఆకుపచ్చ కల - డా.కాసుల లింగారెడ్డి ఒక వేగుచుక్క వెలిసింది కాలపు మొగులు మీద తెలంగాణ పొద్దు పొడిచింది ఆరు పదుల ఆరుగాలం చెమట పొద్దుదిరుగుడు పువ్వై పూసింది రింగన్న పురుగై ఎగిరింది సజన సమ్మెలు మిలియన్ మార్చ్‌లు సాగర హారాలు పల్లె పట్టాలెక్కిన తీరు విగ్రహ విధ్వంసాలు ఉద్యమ వ్యాకరణాలై ఊరేగినవి పెట్టుబడుల గాయాలు తట్టుకొని నాయుడోళ్ళ 'గే'యాలు దాటి నమ్మశక్యంగాని చట్టసభలు 'టీ' బిల్లుల చక్కబెట్టినవి నినాదమంటవో, మా విధానమంటవో పది జిల్లాల ఏకకంఠ పరివ్యాప్త గానమంటవో ఒరిగిన పదివందల ప్రాణాల వెలుగులంటవో కలెబడి కష్టకాలం దాటి నిలబడ్డది నా 'జై తెలంగాణ' ఇయ్యాళ్ళ తెలంగాణ పురుడు పోసుకుంది నన్ను అలవిగాని ఆనందం అలాయిబలాయి తీసుకుంటంది కొత్త ఆశల కౌముది మదినిండ వెలుగుతంది రేపటి ఆకుపచ్చ కల కండ్లల్ల మెదులుతంది -డా.కాసుల లింగారెడ్డి 88978 11844 Category: వివిధ, page4 - See more at: http://ift.tt/1fAq7Gg
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fAq7Gg
Posted by Katta
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fAq7Gg
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి