పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

Dayanand Rao కవిత

// నేస్తానికి చిరు ప్రశ్న // తేది: 25/2/14 నేస్తం! నిజం చెప్పవూ..! కిన్నెరగంధర్వ సంగీత సమస్తాల్నీ స్వరంలో దాచుకున్నది నువ్వే కదూ..! విశ్వవిరుల మరందాన్నంతా మాటల్లో మూటగట్టుకున్నది నీవే కదూ..! సప్తస్వరాల అద్భుతమిశ్రమాన్నంతా పలకరింపుల్లో పొదవుకున్నది నువ్వే కదూ..! గ్రీష్మంలో హిమనగాల శీతలానివై పదాలస్పర్శతో స్పృశిస్తున్నది నీవే కదూ..! వసంతంలో పాదపాల్ని పల్లవింపజేసే కోయిలరాగానివి నువ్వే కదూ..! ఓంకార నాదాల్ని ఢమరుకాల్ని ఏకకాలంలో మదిలో మ్రోగిస్తూ నాట్యం చేస్తున్నది నీవే కదూ..! పగుళ్ళిచ్చిన నామదిబీడుపై తొలకరి చినుకులై పలకరిస్తున్నది నువ్వే కదూ..! ప్రేమతడిలేక వికసించని నామదిగులాబీమొగ్గపై చిరునవ్వుల చిలకరింపుతో గుబాళింపజేస్తున్నది నీవే కదూ..! నాహృదయయంలో చీకటిని ఛీత్కరిస్తూ తారలపారాణితో పాదముద్రలేస్తున్నది నువ్వే కదూ..! నీతలపుల సోపానాల్ని పెనవేస్తూ మరుజన్మకు వారధి వేస్తున్నది నువ్వే కదూ..!

by Dayanand Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eee3dF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి