సొన్నాయిల నరేష్కుమార్ /నాతో ఆ పిస్తాగాడూ/ కొన్ని క్షణాలు పండుటాకులై రాలి పడ్డాక ఏ న్యూటన్ తలపైనో రాలిపడిన అనామక ఆపిల్ పండులా జీవితపు బట్ట తల నిమురుకుంటూ కొన్ని నిరామయపు ఆశలని తడిమేసుకుంటాం ఎప్పుడో చిల్లుపడిన బాల్యపు గోలీకాయ తీపీ వగరుల ఙ్ఞాపకమై వాడి చేతుల్లో పచ్చి మామిడి పిందెలా ఒదిగి కనబడ్డాక..... ఇప్పుడు గతపు జారుడు బల్లపై సర్రున సాగిపోయి అమ్మ వొళ్ళో నోట్లో బొటన వేలేస్కుని కూర్చుని బుజ్జు బువ్వకై మారాం చేస్తూ వాడిలా ఉన్నది నేనేనేమో చిక్కని సాలె గూడై నన్నల్లుకున్న "అంతర్జాలపు మాంత్రికుడా..! ఓ జుకం బెర్గ్" నా మంత్ర దండాన్ని లాక్కుని మాయల పకీరై కుక్కలా ఐనా పర్లేదు అమ్మ రొమ్ము ముందు పడేయవూ.. వాడి లా స్వేచ్చ నివ్వండి నాకు అనంతానంత గందరగోలపు విఙ్ఞానం నుండి రక్షించి నన్ను చిన్ని అడుగుల బాల్యం లోకి తిరిగి పంపండి పొంగే ప్రవాహపు ఝురిలో కౄరత్వం కాక ఆటస్తలాన్ని చూపండి ఔన్రా...... పిరికి దేవుడూ...!! ఈ మనుషుల,ఙ్ఞానాల,మేధావిత్వాలనుండి విముక్తి చేయరా మహోగ్ర జలధునిలో కూడా "నన్ను దిప్పెయ్"దిప్పెయ్" అనగలిగే ధైర్యాన్నివ్వరా మునిగిపొతానేమొ అన్న భయ్యాన్ని తీసేస్తే నేనూ మొనగాన్నైపోతా.... (మెడలోతు నీళ్ళలో కూడా ఆసరా కోరకుండా, ఎత్తుకున్న నాతో "దిప్పెయ్" నన్ను "దిప్పెయ్" అంటూ విదిలించుకొని రెండుసార్లు నిండా మునిగినా అడుగేస్తూ రాయిపై సొంతంగా నిలబడ్డ (పిస్తా) క్రిష్ గాడికి ప్రేమతో) 25/02/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzaf6I
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzaf6I
Posted by Katta
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి