పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జులై 2012, ఆదివారం

కిరణ్ గాలి || భయవత్గీత ||


ఒకానొక రోజు శ్రీ శ్రీ శ్రీ దేవులుంగారు
కాలక్షేపానికి ఒక మహత్కర్యాన్ని మోదలు పెట్టారు

కాలాన్ని పగలు రాత్రిగా విభజించారు
శబ్దన్నో మరి శున్యాన్నో నాకు ఖచ్చితంగా తెలియదు కాని
మోత్తానికి పంచభూతాలుగ విస్పొటించారు

ప్రాణాన్ని ఆడ మగగా వ్యత్యసించారు
సృష్టిని ప్రతి సృ ష్టించే వరమిచ్చారు
సంతృ ప్తిగా విశ్రమించారు

ఈ ప్రాణం
విఛ్ఛిన్నమయ్యేదిగా మోదలై
ఇదేదిగ, పాకెదిగ, ఎగిరేదిగ,
చివరకు అనుకోకుండ
ఆలోచించేదిగా పరివర్తనం చెందింది

ఈ ఆశించని పరిణామానికి
దేవుడు గారు కంగారు పడ్డారు
చించితె నేను చించాలి గాని
మట్టిముద్ద దీనికెంటీ అనవసరపు పైత్యమ్
అని సొచాయించారు

అప్పుడు ఆయన తెలివిగా ఆ మట్టి ముద్దలొ
మనసు అనే వైరస్ని ఇన్జెక్ట్ చేసారు

ఇంకేముంది
మట్టిముద్ద మని ష య్యింది
దానిలో ఆరి-షడ్వర్గాలైన
కామ, క్రోద, లొభ, మోహ, మద, మాత్సర్యాలనే
ట్రొజాన్స్ స్వైరవిహారం చేసాయి

పర్యవసానమే..

త్రేతాయుగంలో మంచికి చెడుకి ఘర్షణ
ద్వాపరయుగంలొ మనిషికి మనిషికి ఘర్షణ
కలియుగంలొ మనిషికి మనసుకి ఘర్షణ

అయ్యో పెద్దాయనా ఎందుకిలా చేసావు అని అడిగితే
నా సృష్టిలొ లోపం ఎమీ లేదురా అబ్బాయ్
ఉన్నదంతా నీ దృష్టిలోనె అన్నారు
నాకు ఫలానికి మలానికి
ఆట్టే తేడా లేదు అని సెలవిచ్చారు

కాని వింటానంటె నీకొక చిట్కా చెప్తాను
నేనూ నువ్వు బింబ ప్రతిబింబాలం
నాలో మంచంతా నీలో వుంది
నీలోని చెడంతా నాలోంచి వచ్చిందే
అంచేత నన్ను కాకా పట్టి
నీకు కావలిసిందంతా పట్టుకుపొ అన్నారు

అయితే మనిషి మనసులో
అప్పటికే ఆరంభమైన
నిరంతర సంఘర్శనల
రాపిడిల ఒరిపిడికి
ఆత్మ అనే
అన్యపధార్దం ఒకటి పుట్టింది

దాన్ని భగవంతుల వారు
కోయలేరు తీయలేరు
కాల్చలేరు పూడ్చలేరు
అది అనంతమైన తేజస్సై
మనిషిలోని మలినాన్ని మింగడం మోదలు పెట్టింది

....

భగవంతుడు నిరాకారుడని ఎవరన్నారు
భయమే భగవంతుడి రూపం
అది లేకపోతె
శ్రీ శ్రీ శ్రీ దేవులుంగారికి
అస్తిత్వమే లేదు

ఆత్మకు ఆకారం వుంది
అదే నిలువెత్తు మానవత్వం
ఈ తత్వమ్ నీకు భోదపడిందా
ఇహ నీకు దేవుడితో పని లేదు

*14-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి