తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
సిపాయి పగిలిన మోకాటి చిప్ప సాక్షిగా
రైతు స్రవిస్తున్న పాదం సాక్షిగా
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
గతించి పోయిన స్మ్రుతుల జోలికి వెళ్ళనని
శవాలపై అయుధాలెత్తనని
తాతలనాటి కసి మనవళ్ళపై చూపనని
నీకు పట్టిన దేశభక్తి నిను కాటికి నడిపించదని
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
అయ్యనూ అమ్మనూ సాకుతానని
తమ్ముడి బాగోగులు చూసుకుంటానని
పక్కింటి బాబాయి కి సాయపడతానని
ఇంటికొచ్చిన వాడికింత బువ్వ పెడతానని
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
లంచం తీసుకోకుండా పని చేస్తానని
ఎక్కడ పడ్తే అక్కడ ఉమ్మనని
అడిగిన వాడికి చేతనైందేదో చేస్తానని
దేశాన్ని దూషించిన వాడి చేతికో ముద్దు పెడతానని
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
పేదవాడి కన్నీటిని నేలరాలనీయనని
అన్యాయం అక్రమాలు సహించేది లేదని
నలుగురినీ పోగేసి పోరాడుతానని
లాఠీలకు చెరసాలకు భయపడేదిలేదని
*15-07-2012
సిపాయి పగిలిన మోకాటి చిప్ప సాక్షిగా
రైతు స్రవిస్తున్న పాదం సాక్షిగా
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
గతించి పోయిన స్మ్రుతుల జోలికి వెళ్ళనని
శవాలపై అయుధాలెత్తనని
తాతలనాటి కసి మనవళ్ళపై చూపనని
నీకు పట్టిన దేశభక్తి నిను కాటికి నడిపించదని
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
అయ్యనూ అమ్మనూ సాకుతానని
తమ్ముడి బాగోగులు చూసుకుంటానని
పక్కింటి బాబాయి కి సాయపడతానని
ఇంటికొచ్చిన వాడికింత బువ్వ పెడతానని
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
లంచం తీసుకోకుండా పని చేస్తానని
ఎక్కడ పడ్తే అక్కడ ఉమ్మనని
అడిగిన వాడికి చేతనైందేదో చేస్తానని
దేశాన్ని దూషించిన వాడి చేతికో ముద్దు పెడతానని
తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
పేదవాడి కన్నీటిని నేలరాలనీయనని
అన్యాయం అక్రమాలు సహించేది లేదని
నలుగురినీ పోగేసి పోరాడుతానని
లాఠీలకు చెరసాలకు భయపడేదిలేదని
*15-07-2012
*ఇంటికొచ్చిన వాడికింత బువ్వ పెడతానని*
రిప్లయితొలగించండి*అడిగిన వాడికి చేతనైందేదో చేస్తానని *
కనీస మానవత్వపు విలువలు కావాలని మృగ్యమౌతున్నాయనీ పెద్దన్నయ్యలాగ పెద్దరికం తో చెప్పారు.. కొంత మంది తమ్ముళ్ళకైనా ఈ వాక్యాలు చేరితే కవిత సార్థకమైనట్టే