పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జులై 2012, ఆదివారం

కిరణ్ గాలి || అతడు ||

అతడెందుకో అదివరకటిలా లేడు
అందమా ఆనందమా తగ్గింది
కళ్ళల్లొ మునుపటి కాంతి శిఖలు లేవు
పెదవులపై ఇంద్ర ధనస్సులు లేవు

ఎందుకనొ మరి అతను అదివరకిటిలా అస్సలు లేడు
దేహం వడలిందా ధైర్యం సడలిందా
యవ్వనానికి వ్రుద్దప్యానికి మద్య
కూలిన వంతెనలా అలా
ఒరిగి పొయాడు
పూర్తిగా ఒదిగి పొయాడు

గతం దిగుడు బావిలో
జ్ఞాపకాల రాయి పడ్డప్పుడల్లా ఉలిక్కి పడతాడు

అనుభవాల ఉరికొయ్యలకి వేలాడుతున్న
అనుబంధాల కళేబరాలు
ఇంకా అతడికి
పచ్చిగానె తగులుతున్నాయా

రాజిల రాపిడిలొ రాలి బూడిదైన అశయాల
అవశేషాలు ఇంకా వెచ్చగానే
అతడిని వెన్నాడు తున్నాయా

అతడెందుకో మరి ఎదురుపడితె
అపరాధిలా తలదించుకునే వుంటాడు
అనుకున్నది సాదించలేదనా
అసలేమీ సంపాదించలేదనా
అవసరమైనప్పుడు సాహసించలేదనా

అసలెందుకని తప్పు చేసినట్టు
తప్పించుకు తిరుగు తాడు?

ఒంటరిగానె ప్రపంచాన్ని గెలవాలని బయలు దేరిన వాడు
పాండవులే కౌరవులని తెలిసి బహుశా అస్త్ర సన్యాసం చేసాడు

ఇన్నేళ్ళ అజ్ఞాన వాసం ముగిసి
సిగ్గుతొ అజ్ఞాత వాసంలోకి వెల్లిపొయాడు
ఇప్పుడు ఎదురుపడ్డా
ఎరగనట్టే వుండిపోతాడు

అద్దంలో అతడు
అదివరకటిలా లేడు
అపరిచితుడిలా వున్నాడు

*14-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి