పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Si Ra కవిత

Si Ra // మతిమరుపు //9-6-14 ఈ మధ్య మర్చిపోవటం కూడా ఒక అలవాటైపోయింది అలాగే వెతకటం ఒక సరదా గా మారిపొయింది. ఇప్పుడే ఎక్కడో తెలుపు రంగును చూసాను, అదిగో అక్కడ నా ఏ.టి.యం పెట్టాననుకుంట ఇంతకూ నా ఫోను ఎక్కడుంది ? ఈ టివి రిమోట్ ఎందుకు పెట్టిన చోట అస్సలుండదు? ఇప్పటివరకు నా చెతిలో ఏదొ ఉండాలి కద, అది ఏమయ్యింది? వెతికేకి ఒక పద్దతి ఉంది, చివరిసారి వస్తువును ఎక్కడ చూసావో అక్కడికి వెల్లి దాని పరిస్తితిలో నిన్ను నువ్వు ఊహించుకొని, దానిలాగా ఆలొచించాలి. అప్పుడే అది పోగలిగే ప్రదేశాలకు నువ్వూ పోగలవు అప్పుడే ఆ వస్తువు ప్రపంచాన్ని నువ్వూ చూడగలవు. ఈ మద్య మరి ఎక్కువ అయ్యింది నా మతిమరుపు; ఫ్రిడ్జి లో డబ్బులు పెడ్తున్నాను, కీలు పెట్టే చోట గడియారం పెట్టేస్తున్నాను , సబ్బు పెట్టాల్సిన ప్రదేశంలో కాఫీ గ్లాస్ పెడ్తున్నాను , రాత్రి నిద్రపోవాల్సింది పగలునిద్రపోతున్నాను , వాస్తవంలో చెయాల్సిన పనిని స్వప్నిస్తున్నాను , నేనంతకు నేనే కిక్కిరిసిన మార్కెట్ లో తప్పిపోతూ, తిరిగి నన్ను నేనే వెతుకుతూ, జ్ఞాపకాలలో పాతుకుపోయిన ఒక గుర్తును తిరిగి కనుక్కోని పాతరోజులలోకి పడిపోవటం, అనంత విశ్వంలో నన్ను ఎవరో మర్చిపోయారేమో అని ఆలొచిస్తూ ఆలొచిస్తూ, ఒక ఆలొచన అయిపోవటం, తిరిగి నా భౌతిక రూపాన్ని కనుక్కోవటం, ఇలా నన్ను నేనే మర్చిపొయ్యి , తిరిగి నన్ను నేనే వెతుక్కొవటం. ఈ యాంత్రిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు నన్ను నేను నాకు నేను గుర్తుచేసుకొవటానికి మర్చిపొవటం ఒకటే మర్గం.

by Si Ra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uM1Jrd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి