అజ్ఞాని నువ్వు తాగుబోతువో లేక లేక పుట్టిన ఫిలాసఫర్ వో నువ్వు తాగుబోతువే అయితే తప్ప తాగిపోతోంది నీ అహాన్ని నువ్వు ఫిలాసఫర్ అయితే నీ మొత్తుకోలు నీ స్వార్ధానికి నీ వేదాంతం ఎండమావుల ఎడారులు దాటి అథోఃపాతాలాన చేరి నీ కాలి కిందే విలవిలలాడి కొట్టుకు చస్తుంది నీ తాగుడు విశ్వ జ్ఞానాన్ని ప్రకటించి బోధి వృక్షాన వికటించి నీ శ్మశానానికి నెత్తురు కక్కుకు పోతోంది ఇపుడే వీలుంటే మేలు చేయక కీడు తలచక నీ ఒంటరి కలల్లోకి ఒద్దికగా జారుకో రేపే ఉషోదయాలు అవి నీ మత్తు కళ్లను అవిటి కలలను తప్పక భస్మం చేస్తాయి నీ పిరికి చేష్ఠలు పిల్లి కూతలు ఈ నిర్జనులకు అవసరమే నేడే నీ స్వార్ధ అశ్రువులకు వారి నివాళి ఉదయ్ 12.05.14
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbEUu9
Posted by Katta
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbEUu9
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి