(నా మిత్రుడు రాసిన కవిత ఇది. ప్రథమ ప్రయత్నం కాబట్టి కొంచెం వెనుకాడుతుంటే తనకు బదులు నేనే పోస్టు చేశాను. పేరు చెప్పలేను. అజ్ఙాత కవి...) కవీ, కళాకారుడా నువ్వు రాసిందే రాత నువ్వు గీసిందే గీత నువ్వాడిందే ఆట, పాడిందే పాట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కానియ్ కానియ్ ఇంతకూ నీ ఏడుపేంది మమ్ముల నవ్వియ్యాలనేనా కానియ్ కానియ్ కవీ, కళాకారుడా అయిందా , అయితే పో ఇగ ఏందీ పోవా... ఏం గావాలె నీకు పైసలా... ఒద్దా ? తిండా? బట్టలా?...అవీ ఒద్దా? కవీ, కళాకారుడా ఏం గావాలె మరి నీకు? నువ్వే ఇస్తవా ? ఏందది? అంత కొశ్శెగ ఉన్నది..అంత మెరుస్తున్నది? ఆలోచనా? చైతన్యమా? ఏందది? బతుకా...బతుకు మీద ఆశనా... కవీ, కళాకారుడా ఏందది? ఇచ్చినవు గద ఇగ వో పోవా...మా మెదళ్లు కదిలిచ్చినవు గద నువ్వు కదులిగ ... ఏం చూస్తున్నవు మా గుండెల్ల...ఏమున్నది? శూన్యమే గద ... నీ మొహంల కనపడ్తనే ఉన్నది... నిర్వికారం...ఒక్క దేవునికే సాధ్యమది... కవీ, కళాకారుడా...నువ్వు దేవునివా?
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qx0hJT
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qx0hJT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి