పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మే 2014, సోమవారం

Krishna Mani కవిత

మానవ కాకి ________________________కృష్ణ మణి మానవ వికృత విలయాన్ని చూసి లయకారకుడే లబలబమన్నాడు సిగ్గులేని మానవకాకి శృంగారానికి వరస ఏదైతేనేమన్నాడు వయసేదైతేనేమన్నాడు పసి ఆకులను చిదిమేసిన చచ్చువెదవ ! కనికరంలేని కసాయికేది దొరికిన వదలడు పాపం కళ్ళులేని కత్తికేమి తెలుస్తుంది కోసేది పీకని శవాల దిబ్బల ధర్మాసుపత్రి డబ్బులు రాలందే చచ్చిన మనోడు బయటకు రాడు దాపులేని బతుకుకు రోడ్డే దిక్కైతే లారీ టైరు కింద ఇస్త్రీ ! ఆకలికడుపున ఆపద్బందువని కొట్టిన జేజేలు ఓటువేసేటప్పుడు గుర్తుకొచ్చేది వెయ్యినోటు సారసీస మనోడు ఏమిచేయ్యకపోయినా సరే పక్కకులంవాడు రావొద్దు గద్దెనెక్కిన గలీజోడు దిగేదాకా పందికొక్కు మానవత్వం మరచిన మనిషి మరుభూమిలో పురుగు ! కుళ్ళిన లోకంలో కురువని విషం ఎక్కడా ? కృష్ణ మణి I 12-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oH8IhO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి