నా కవిత ,మనసు పొరలలో నిన్నటి (11.05.2014) ఆంధ్రప్రభ.కాం లో ప్రచురిచతం మణి వడ్లమాని మనసు పొరలలో నన్ను ఒంటరిని చేసి నువ్వు అనంతదిగంతాలలో కలిసి పోయినా నీ జ్ఞాపకాల పరిమళాల గుబాళింపు నన్ను చుట్టుకునే వుంది సన్నజాజి పందిరి పక్కనే అల్లుకున్న జూకా మల్లి, ఆ పక్కనే వున్న రాధ మనోహరాలు, నీలి గోరింటలు చిరుగాలికి అటూ ఇటూ ఊగుతూ వుంటే.. ఎప్పుడూ మల్లెలు, మందారాలేనా? మేము అందగత్తెలమే అంటూ కినుకగా చూస్తున్న కనకాంబరాలు, చంద్రకాంతాల మధ్య సిగ్గుల మొగ్గలా ముడుచుకున్న నీ ముగ్ధ మనోహర రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే వుంది. చిలకాకు పచ్చ పట్టు పరికిణి, జాగెట్టు మీద ఎఱ్ఱటి వోణితో అచ్చు చిలకలా ఉన్నావని అంటే కిలకిలా నవ్విన ఆనాటి నీ అందమైన నవ్వు మనోహరమైన ఆ జ్ఞాపకం నా హృదయపీఠంలో ముద్రించుకుపోయాయి ఆ నాడు చెప్పుకున్న మాటలు, చేసుకొన్న బాసలు ఈ నాటికి నా మది గదులలో నిండే వున్నాయి ఆ నాడు నువ్వు పాడిన పాట వింటూ ప్రపంచాన్నే మరచిపోయిన నాకు, ఇప్పటికి ఆ పాట నా గుండె చప్పుడుతో కలసి వినిపిస్తూనే వుంది. ఓ సహచరీ! మనం కలసి చేసిన ఈ జీవన ప్రయాణంలో,నీవే నేనై, నేనే నువ్వు అయి జీవించాము, నా తుదిశ్వాస విడిచే వరకు, నీ రూపం ఎప్పటికీ కళ్ళముందు కదలాడుతూనే వుంటుంది నీ జ్ఞాపకాల సుగంధ పరిమళం నా మనసు పొరలలో నిలిచే వుంటుంది!!
by Mani Vadlamani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDWztX
Posted by Katta
by Mani Vadlamani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDWztX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి