ఎం. శేషగిరి || మా గుడిసెలకు నీరంటుకుంది|| మా గుడిసెలకు నిప్పంటుకోవడం పాత మాట! ఇప్పుడు నీరంటుకోవటం కొతామాట!! చెట్టుకు చెదలుబట్టడం చూసాము నీరుబట్టడం చూడబోతున్నాము నిప్పంటుకుంటే నీరార్పేది నీరే అంటుకోబోతోంది ఏం చేయాలి? ప్రకృతి సునామీలు కనబోతున్నాము! మ సహజ సుందరమైన జీవితాన్ని లేవదీసి కృత్రిమ జీవితంలో కుదిస్తారట పోలవరం కొందరి జీవితాలకు పూలవరమే కావచ్చు.... మా గిరిజన బతుకులకది పెనుభారం! మా అడవి సంపదను బేరీజువేసే మాయా తులభారం! ఆహా! ఎంత ప్రకృతి సౌందర్యం అని పొగిడినోళ్ళే దానిని వికృతం చేయచూస్తున్నారు పాపికొండలను సహితం ముంచే పాపానికి ఒడిగట్టారు మా పేరంటాల పల్లిని అడుగంటా ముంచేయజీస్తున్నారు వరాలిచ్చే వరద గోదావరిని చించి మా బ్రతుకులకు పరదాకుడతారట! అనాదిగా శోభిస్తున్న మా గిరిజన సంస్కృతి పునాదిని దెబ్బదీసి సమాధిగట్ట జూస్తున్నరు! అమ్మో! మీరు మామూలు వాళ్ళుకాదు అందమైన మా గుట్టలనే గుటక వేయాలనుకుంటున్నరు మా అమాయక గిరిజన కాకులని గొట్టి మీ బహుళజాతి గద్దలకు వేయనెంచారు! తరితరాల మా స్మృతి చిహ్నాలను చెరిపేసి మీరుగట్టే ప్రాజెక్టులు మీకో మాకో మృతి చిహ్నాలవుతాయి జాగ్రత్త! ** జీవన్మరణం - పోలవరం గిరిఘోష (కవితలు, కథల సంకలనం - సాహితీ స్రవంతి ఖమ్మం ప్రథమ ముద్రణ ఫిబ్రవరి 2006-- ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి ఆధ్వర్యాన ఇరవైమంది కవులూ, రచయితలు, పోలవరం వల్ల మునిగే ప్రాంతాలయిన కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం,వి.ఆర్.పురం చింతూరు మండలాల గ్రామాలు పర్యటించి అక్కడి గిరిజనుల, గిరిజనేతరుల మనోభావాలను, అవేశాలను, ఉద్వేగాలను తెలుసుకున్నారు. కవిత్వానికి మౌలికంగా చైతన్యం కావాలి. కథకు జీవితపు వివిధ కోణాలను చూడగల అంతర్‌దృష్టీ అవసరం. కవిత్వానికి కావల్సినంత చైతన్యాన్ని, కథా రచనకు కావలసినంత జీవిత విభిన్న చిత్రాలను వారినుండి పొంది తెలుసుకున్నది వారి లయబద్ధ మాటల్లోని స్పష్టత, ధిక్కారం, ధైర్యసాహసాలు, మానవీయ ప్రాధేయతలు కదిలించాయి కాబట్టే ఈ సంకలనం వాటికి ప్రతిబింబం. *** 28.5.2014
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pnxma8
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pnxma8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి