పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మే 2014, గురువారం

Ravinder Vilasagaram కవిత

అడవి తల్లి ఆవేదన ~~~~~~~~~~~~~~~ అందాల కల్పవల్లిన ి ఆనందాల హరివిల్లును భూమాత వొడిలో విరిసిన తరులతల పచ్చని బంగారాన్ని... పక్షుల కిలకిల రావాలతో పండువెన్నెల వెలుగులతో అందాలన్నీ ఒలకబోసిన వయ్యారాల సింగారాన్ని గోదారి జలధార మధువు తాగి గుట్టలపై విరిసిన గుబురువనాన్ని రామయ్య అడుగులలో పూసిన రమణీయ పుష్పవనాన్ని సీతమ్మ పాదాల పారాణి తాకి మధుర ఫలాలనిచ్చే వృక్షజాలాన్ని జంతువుల వలపు కుటీరాన్ని విహంగాల విహార కేంద్రాన్ని ఆదివాసులకు ఆత్మబంధువును గూడెపుజనుల గుండె గొంతుకను అలాంటి నన్ను రక్షస రాజకీయ క్రీడలో స్వార్థం మీరిన కాంక్షతో అమానుషంగా అమానవీయంగా చెరబడుతున్నారు తరాల సంపద తరలించే ఏర్పాట్లు కుటిల మానవుడి కుయుక్తులు విషపుకోరల వింత నాటకాలు ఆర్డినెన్సుల ఉరితాళ్ళు అడవిని ముంచి ఆత్మను చంపి ఆదివాసుల్ని తరిమి తరిమి కొడతారు గూడెపు వాసుల గొంతుల్లొ గునపాలు దించుతారు విహంగాల ముక్కుల్ని తూములుగా చేస్తారు! వేలవేల ఏళ్ళ ప్రాచీన వృక్షలాన్ని కాలువలుగా కడతారు!! ధరిత్రిని సస్యశ్యామలం చేస్తారట!!? కొందరి వరాల కోసం పోల'వనాన్ని' పోలవరంగా ముంపులో ముంచుతారట అపురూప సంపదను అసంఖ్యాక జీవరాశిని అమాయకపు ఆదివాసులను శాపగ్రస్తం చేస్తారా?

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCwHj6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి