## గమ్మత్తు జీవితం ## నడిచే పడవలోకి హటాత్తుగా దేవుడు మారు వేషంలో ప్రత్యక్షమయి ఆ పడవ లో ఉన్న వ్యక్తుల్ని అందర్నీ ఇలా అడిగాడట నీ జీవితంలో నువ్వేం నేర్చుకున్నావ్ ? అని అప్పుడు ... పడవలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెప్పాడట " నేను జావా , సి ++ లు నేర్చుకున్నానండి బాగా డబ్బులు సంపాదిస్తున్నాను " అన్నాడట అదే పడవలో పక్కనే ఉన్న ఓ విలేఖరి ని అడిగితే " అబద్దాన్ని ఎలా అమ్ముకోవాలో నేర్చుకున్నానండి అప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది అని తెల్సుకున్నాను" అన్నాడట అలా ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఓ ఇరవై ఏళ్ళ అబ్బాయిని అదే ప్రశ్న అడిగితే చెప్పడట " అమ్మాయిల్ని ఎలా కెలికితే మన దారికోస్తారో నేర్చుకున్నాను సర్ " అని చివరగా మిగిలిన పడవ నడిపే వ్యక్తి దగ్గరికెళ్ళి అడిగాడట, అప్పుడతను .... " నాక్ సి , సి++ లు రావు సామి, డబ్బులు బా ఒస్తే బావుండును అని ఆశైతే ఉంది గాని , అమ్మా అయ్యని దూరం చేసే డబ్బు నాకొద్దు . అబద్దాన్ని ఎలా అమ్ముతారో తెల్సుకోలేని ఎర్రి బాగులోన్ని సామి. ఆళి మీద అరుస్తా ఉంటాం గాని ఆడోల్లని గౌరవిస్తాం సామి మేము , సిన్నగా సెప్పాలంటే ఉన్న దాంట్లో సద్దుకుపోయి తృప్తిగా సిగ్గుతో బతకడం నేర్చుకున్నా సామి " అన్నాడట అదంతా విన్న దేవుడు ... " చదువుకుంటే జ్ఞ్యానం పెరుగుతుందన్నాను , కాని వీళ్ళను అజ్ఞ్యానం ఆవహిస్తున్దనుకోలేదు. అవకాశం మంచితనాన్ని పెంచుతున్దనుకున్నాను,కాని మానిషి అసమర్ధత ని పెంచుతున్దనుకోలేదు . యువత ఈ దేశానికి వెన్నముక అవుతుందనుకున్నాను కాని విరిగిన ఎముకలా మారుతున్దనుకోలేదు." మత్తులో ఉన్నా సరే , గమ్మత్తు జీవితం ఐనా సరే , ఆ పడవ నడిపే వాడే నయం మనుషుల్ని మనుషులుగా చూడలేని ఈ వింత జంతువుల మద్య దేవుడితో సగటు మనిషిని పోలుస్తున్నాడని సంతోషించి . అలా అర్ధం కాని సందేహంతో అజ్ఞ్యానంలో బ్రతుకుతున్న అమాయకుల్ని చూసి జాలి పడుతూ , బాధ పడుతూ వెళ్ళిపోయాడట ! " Dignity is not based on Degree & Good Designation doesn't need any Degree " kAlluRi [ 21 - 05 - 14 ]
by Rajender Kalluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1thX4fO
Posted by Katta
by Rajender Kalluri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1thX4fO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి