పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఏప్రిల్ 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

రెండు జాముల రాత్రి అది వరకు అన్ని బాగానే వుండె తప్పిపోయిన పిల్లవానిలెక్క ఇపుడిదేం బాధ మొసదిప్పుకోనియ్యకుండ మోక జూసుకుని ఈ మోటకొట్టే దుఃఖాలేంది? యాదికి రాంగనె బిరాన ఉరుకులాడె గోసెందుకు ఎవరో రాక ముందే పరిచిన రోడ్డులెక్క ఎదురుచూపులేంది? నాకున్నదేంది బతుకంతా నేసుకున్న పాటలగొంగడి వానకు, ఎండకు, చలికి గుండె ఒలికిన దుక్కాల మీద కొప్పెర, పత్తికాయలెక్క గుండెపగిలి పాడిన పదంతోటి ముచ్చట తిప్పతీగ తొక్కినట్టు తిరుగుడె నీ జాడపట్టి మేక నములని ఆకు లెక్క ఒక్కణ్ణే మిగిలిపోతి కానుగుపూల గుమ్మువాసనల చీకట్లో యాదిపారే పిల్లకాలువ పాము ఈత వాడకట్లు తిరిగే రాత్రికి తోడు చిమ్మెట్ల శ్రుతి అరుగుమీద వెన్నెల కప్పుకుని నేను గునిసే శ్వాసలతో గూనిరాగాలు నిద్రకాచి గోరుకోళ్ళు కోడికూతలై పిలుస్తయి తడిక తీసుకుని నువ్వెళ్ళి పోయినట్లు అడుగుల సప్పుడు....

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h6vaPK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి