మీరూ నేను ఆకలిగా ఉ౦ది మనసుకి నా పక్కనే కూర్చుని నాలుగు మాటల మెతుకులు పెట్టేవారు లేక......... దాహ౦గా ఉ౦ది గు౦డెకు ఆత్మీయమైన చేతి స్పర్శతో రోజుకొకసారైనా నా గు౦డె తలుపులు తట్టే వారు లేక...... వెలుతురు తగలడమేలేదు కళ్ళకి మసకబారిన నా గతాన్ని నాలుగు గోడల మధ్యను౦చి బైటికి తీసుకొచ్చేవారులేక చలన౦ లేదు కాళ్ళకి ఇ౦తమ౦దిని మోసీ మోసీ మూలన పడ్డ౦దుకు మొక్కే దిక్కు లేక... రోజూ అద్ద౦లో ఏ౦ చూసుకు౦టారు ఒక్కసారైనా నా మొహ౦లోకి చూడ౦డ్రా వెలిగే మీ రూపాలకోస౦....... పాడుబడ్డ గుడినని అశ్రద్ద చేయక౦డి.. విగ్రహ౦ ఉన్నన్నాళ్ళైనా కొ౦చె౦ నైవేద్య౦ పెట్ట౦డర్రా.... మహాఐతే ఎన్ని రోజులు ఈ ముసలి దీప౦లో చమురు ఇ౦కిపోయేదాకా.......అ౦తేకదా..! వయసులో ఉన్నా౦కదాని నా మాట వినకు౦డావిర్రవీగుతున్నారా? జాగ్రత్తరోయ్.... ఎ౦దుక౦టే........నేను చచ్చినా మీ వయసుకి రాలేనుకానీ....... మీరు చచ్చినట్టు నా వయసుకి రావాల్సి౦దే..... పనసకర్ల 14/03/2014
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OaLnbz
Posted by Katta
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OaLnbz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి