||ప్రేమోదయం|| ఒక నిండు మనసు కురిపించిన ప్రేమ వర్షంలో.... తడిసి మనిషిగా మారిందొక జీవితం... మొదటినుండి ఒక ధారలానే మురిపిస్తున్న ప్రేమను గుర్తించలేక, విచక్షణాహీనమైన మనసొకటి ఎన్నెన్నో అర్థంలేని పొగరుతో నేను అనే అహంభావముతో నీవు లేకపోయినా ఉండగలను అనే వెర్రి ఆలోచనతో భలే ఎగిరింది ఉన్మాదినిలా. ఇవన్ని చల్లగా చూస్తూ ఉన్న ప్రకృతి ఇప్పుడు రంగలోకి దిగింది. ఆ మనసుకు దివ్యదర్శనం కలిగించింది. తెలుపు-నలుపు, మంచి- చెడ్డల అనుభవం ఒక అందమైన పాఠంలా నేర్పింది.జీవితాన్నిచ్చింది. ఇదేనేమో ప్రేమ మహిమ. ప్రేమ గొప్పదనం. ప్రకృతి కారుణ్యము. చిగురుటాకులోంచి అప్పుడే పడుతున్న చిన్నారి చినుకులనూ తనలో చేర్చుకుని హాయిగా ప్రవహించే నదీమతల్లిలా, వర్షం తర్వాత మెరిసే శుభ్రాకాశంలా, మంచి కుసుమాలపైనుంచి వీచే చల్లని పవనంలా, ముదమును కలిగించు పచ్చని సిరులతో నిండిన భూమాతలా, వేదోక్త మంత్రాలతో అర్చిస్తున్నప్పుడు హోమకుండంలోని అగ్నిహోత్రుడిలా, పంచభూతాల సాక్షిగా నీవందించిన ప్రేమ జన్మజన్మలకూ మరిచిపోలేను ప్రాణమా. నా జీవమా. ॥మాలచిదానంద్॥18-3-2014||
by Mala Chidanand
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKL5mY
Posted by Katta
by Mala Chidanand
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKL5mY
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి