kb ||ఎనోమలి|| వాడొక చినుకులాగా వున్నప్పుడు మొలకెత్తే విత్తులా వున్నప్పుడు విచ్చుకున్న పువ్వులాగా నవ్వినప్పుడు విరజిమ్ముతున్న నిప్పై రగిలినప్పుడు వాడొక తేడాగాడు. సులభ్ కాంప్లెక్స్ తలుపు మీద రాతలా లేనప్పుడు తుపుక్కున్న ఉమ్మిన పాన్ మరక కానప్పుడు జిల్ జిల్ జిగాలో ముడుక్కుని కూర్చున్నప్పుడు బురదలో పందిలా దొర్లనప్పుడు వాడొక తేడాగాడు. కాస్తంత బుర్రను వెలిగించుకున్నప్పుడు మైకాన్ని వదిలి మాట్లాడినప్పుడు బాధ్యతకు నిలబడి బతికినప్పుడు గుండెల్ని తెరుచుకుని హత్తుకున్నప్పుడు వాడొక తేడాగాడు. సవాలక్షా మాడాగాళ్లకు, మాయదారి మీటాగాళ్లకు అప్పుడైనా, ఇప్పుడైనా, ఇంకెప్పుడైనా వాడెప్పుడూ తేడాగాడే. ------------------------- 17/03/2014., 23.29
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVQHgX
Posted by Katta
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVQHgX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి