పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మార్చి 2014, మంగళవారం

Maheswari Goldy కవిత

మహేశ్వరి గోల్డి || శృ తి ల య లు || మధు మోహనా...!! మధుర స్వాంతనలో మౌనికనయి శ్వాసిస్తున్న నా ఊపిరి ఊహలు అనురాగ సౌధంలో ఆమని కవితలుగా సంతరించుకుంటూ మధువనిలో మంత్రజలముతో గత విధి జ్ఞాపకాలకు........... ఊపిరి పోస్తే అది ఒక ఆశ్చర్యం...!! మరి ఎందుకో తెలుపనా...?? ఓ నా ప్రియసఖా...!! అందంగా అలంకరించుకున్న మలయమారుతాలు నా కవితా భాష్యాలకు నగిషీలద్ది...!! కృష్ణమ్మ నదిలో నీలి కెరటాల ముసుగులో అనురాగ తెమ్మెరలపై దివ్య దీపాలయి ప్రేమ సింధూరపు వన్నెలతో ప్రణయరాగం అలపిస్తూ పరవశిస్తూ పుడమి పై పుష్యమి నక్షత్రాలుగా వర్షిస్తూ నర్తిస్తున్నవి మమతావేశపు వెల్లువలో వసూధరా...!! ఆ వెల్లువలో సుగంధినీ లతలా ఇంధ్రధనస్సు అంచున మాలతీ సౌరభాల సాక్షిగా నే అల్లుకుపోతున్నా సౌగంధికా వనవాసంలో ఓ ఊహల వాహినిలా నా సునయనా...!! ఆ ఊహలు గత జన్మ తిమిరాలను సైతం ఈ జన్మ వేదికలో అందమయిన అక్షర కాంతిలో కరిగించి కావేరి సరోవరాన ప్రేమ సుమాలతో సాదరంగా స్వాగతిస్తున్నవి సిరిసిరి మువ్వల గమకములయి స్వయంవరా...!! ఆ స్వాగతాలు మన ప్రేమసౌధంలో అనురాగ వీణపై సరిగమ సరాగాలుగా శృతిలొలికిస్తూ రాగదీవిలో నీ కరి నాగు కురుల కవితా కోమలిని ఓ వెన్నెల శిల్పంలా అలంకరిస్తున్నవి మనోహరా...!! ఆ అలంకరణలో ఓ దివ్య గంధర్వ కోమలినయి నే ఎదురు చూస్తున్నా...!! మాధవుని ఆరాధనకు మమతల దీపాలతో ఎదురుచూసిన ఓ అనురాగవతిలా నీ ప్రియ మధుమతినయి మధూధయా...!! 18/03/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OrHhvW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి