పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Sateesh Namavarapu కవిత

***అర్ధం కాని "అర్ధం"*** తట్టుకోలేని కష్టం కాటేస్తే.. ఆపలేని..కురిసే వర్షం..కన్నీరు.! పట్టరాని సంతోషం వాటేస్తే.. ఓపలేని..మురిసే హర్షం..భాష్పాలు.! ఏదైనా వండి వార్చేది, నయనద్వయమేనా..? కష్టమైనా, సుఖమైనా.. సమాన న్యాయమేనా..?? స్పందించే మనసు సంధించే భావ శరాలకు అనుగుణం, అందించేను జల ధారలు.. అదే కనుల అద్భుత గుణం. అందరికీ గెలవాలనే ఉంటుంది బతుకు యుధ్ధం.! కానీ ఓడే వారు ఎక్కువ.! గెలుపూ, ఓటమీ కాకుండా, బతుకూ, చావూ కాకుండా.. ఏడవలేక నవ్వుతూ, నవ్వలేక ఏడుస్తూ.. బతుకీడ్చేవారూ ఎక్కువ..!! నేటి బతుకు "ఖర్మ" నిన్నటి "కర్మ" ఫలితమా, మొన్నటి జన్మ ఫలం.. పాపం అవశేషాల మిళితమా..?? అర్ధం కాక అయోమయంలో.. జన్మలెన్ని గడచిపోయాయో, "అర్ధం" లేక అవమానంతో.. బతుకులెన్ని బండబారిపోయాయో..?? సామర్ధ్యం లేదని, వ్యర్ధమని తలచి గుండెలెన్ని పగిలాయో..?? లెక్క తేల్చేదెవరు..? దిక్కు చూపేదెవరు..??..01Fఏభ్2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fwQKvm

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి