పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, ఫిబ్రవరి 2014, గురువారం

Nirmalarani Thota కవిత

ఒక ప్రభాతం నీ పలకరింపుతో మది వాకిలి ముందు రంగవల్లవుతుంది . . . ! ఒక ఆమని నీ ఆలాపనలో అరవిరిసిన విరితోటవుతుంది . . ! ఒక శిశిరం రాలే అనుభవాల్లో నీ ఙ్ఞాపకాల చివుళ్ళకు నెలవవుతుంది . . ! ఒక కాంతి పుంజం నీ కన్నుల్లో నిండి బ్రతుకు పయనానికి బాటలు వేస్తుంది . . .! ఒక సాయం సంధ్య వాలే పొద్దుకు నివాళై నీ పిలుపు భూపాలమై స్పృశిస్తుంది . . ! ఒక చల్లని రేయి నీ తలపు వెన్నెల్లో తడిసి మైమరుపు మంచు బిందువై మెరుస్తుంది. . ! ఒక "జన్మ" నీ చెలిమి జ్వాలల్లో పునీతమై సార్ధకమవుతుంది . . ! నిర్మలారాణి తోట { 13-02-2014 }

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aXQgPq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి