విన్నపము! వారణాసి రామబ్రహ్మం 13-2-2014 అట నుంటివో ఇట నుంటివో ఎద ఎద నుంటివో కంటికి కానరావు ఎట నుంటివో తిరు వేంకటరాయా! ప్రవహించు గోదావరులు నీ వేగమో ఊహించు కవులు నీ భావావేగమో సాహసించు శూరుల ధైర్యము నీవో వచించుము వన్నెలదొరా ! తిరు వేంకటరాయా! కన్నెల సొగసులు రమణుల రంజనములు నీ రూపో వారి వన్నెల చిన్నెల సింగారములు నీ కులుకో ప్రేమ భక్తి అనురాగములు నీ కరుణలో వాత్సల్యమున నను చేరదీయుము తిరు వేంకటరాయా! అన్నమయ్య పదములు నీ నెలవో త్యాగరాజు కృతుల నీ నివాసమో రామదాసు కీర్తనల నెలకొంటివో పలికించుము నన్నును తిరు వేంకటరాయా! అష్టాక్షరిని ఊయలలూగెదవో పంచాక్షరిని పూర్తిగ నిండితివో షోడశాక్షరిని తల్లి పద్మావతితో నుంటివో అందుము అక్షరరూపా! తిరు వేంకటరాయా! ధ్యానములు తపములు ఉపాసనల నుంటివో పూజలు భజనలు అభిషేకముల నుంటివో జ్ఞానుల నిర్మల మానసము నీ తావో తెలియగజేయుము తిరు వేంకటరాయా! అట నుంటివో ఇట నుంటివో ఎద ఎద నుంటివో కంటికి కానరావు ఎట నుంటివో తిరు వేంకటరాయా!
by Ramabrahmam Varanasi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwfRNx
Posted by Katta
by Ramabrahmam Varanasi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwfRNx
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి