పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, ఫిబ్రవరి 2014, గురువారం

Chand Usman కవిత

చాంద్ || వాడు వ్యభిచారి || పసిదేహాన్ని తుంచి నల్లని దేహంలో కలిపేసిన నీ చేతులకు ఆ తడి ఇంకా ఆరలేదు గమనించావా నీ మేలేసుకున్న మీసాల వెనుక తలదించుకోవాల్సిన నిజం ఎవ్వరికీ చెప్పకు అదే అదే నువ్వు అనగా నేను, నేను అనగా నాలాంటివాళ్ళు అందరం కలిసి ఆమెకు కొనిచ్చిన మగాడు 'వ్యభిచారి' అనే రహస్యాన్ని వెలుగులో ఆమెను మోహించలేక రాత్రి మాత్రమే హత్తుకోగల నపుంసకుడు వాడు వెన్నెల సాక్షిగా వాడు వదిలిన దుస్తులకు తప్ప ఆమె ఎప్పుడూ వాడికి అంటుకోలేదు, కనీసం పూయబడనూలేదు చూడు వాడి ఆంక్షల కౌగిలిలిలో ఎన్నో సార్లు మానభంగం చేయబడి ఇంకా మరెన్నో సార్లు చేయబడటానికి ఆమె తాళికి కట్టబడింది ******* ఆమె ఈరోజు కూడా వాడి లోపలి చేయి పెట్టి హృదయమంతా వెతికి వెతికి కొంత రక్తాన్ని వాడికి చూపిస్తూ ఇది నీదేనా ? నేను కాక ఇది ప్రవహిస్తుంటేనూ.. అని అడిగింది అలా వాడు సిలువ వేయబడటం ఇప్పటికి ఎన్నిసార్లో కొట్టబడిన మేకుల గుర్తులే చెప్పాలి ఎన్నో సార్లు వాడు దిగంబరంగా నిలబడి ఆమెను కళ్ళతో స్పర్షిస్తూ అడగాలనుకుంటాడు నేను తొడుక్కోవల్సింది నిన్ను కాదు నన్ను కదా ..? ******* ఆమె అతనిని, అతను ఆమెను లోపలికి హత్తుకోవాలంటే నువ్విక వాడిని వ్యభిచరింపనీయకూడదు అదే అదే నువ్వు అనగా నేను, నేను అనగా నాలాంటివాళ్ళు వ్యభిచారమనగా ఒకొక్క సారి నీకోసం, మరొక్కసారి నాకోసం నేను నీలాగో నీవు నాలాగో ఉండాలనుకోవడమే కదూ మీ చాంద్ || 13.Feb.14 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gtI1d4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి