పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, ఫిబ్రవరి 2014, గురువారం

మరువం ఉష కవిత

మరువం ఉష | శతకాలు వల్లెవేయించి, పద్యాలు బట్టీపట్టించి --------------------------------------------------------- చదువే లోకంగా చదివించిన ఘనవిద్యలెల్లా… తిరగరాసి మరోమారు మననం చేయించె నిత్యజీవితం వైద్యునికొరకు అప్పిచ్చువాడిని వెదికాను అప్పుతీర్చలేక వూర్లు పట్టి ఏర్లు దాటి పరుగిడాను మేడిపండు సమాజం పొట్టవిప్ప లోటుపాట్ల పురుగులు లోపమెంచి చిచ్చుపెట్ట లోకులే పలుగాకులని కన్నాను శతకాలు శతకోటి నేర్చి నీతిచంద్రికలు ప్రీతిగా వినుకుని పన్నాగాలు పన్నేటి గోముఖవ్యాఘ్రాలను చూసి భీతిల్లాను తల్లితండ్రులందు దయలేని పుత్రులు దేశప్రగతికి వారసులు తోబుట్టువుల మోసగించు దగాకోర్లు దండనాథులు సదా ఈ తారుమారుల్లో సతమతమైన నా మానసం తెలుసుకున్నదొక్కటే పాఠం - జీవితమే గురువు జీవించను నేర్పగ వినరా అని నేనెవరినీ అడుగను, కనరా అని చాటి చెప్పను నేర్వని పాఠాలు సాధనచేయ మనిషికో తీరుగ మారును 02/12/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwfUJ0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి