గుబ్బల శ్రీనివాస్ ।। అడుగులు ।। ---------------- రూపాంతరం చెందాయి ఈ అడుగులు సుతిమెత్తని తత్వం నుండి గట్టిపడి మొరటుగా. ఆప్పుడెప్పుడో తొలినడక నేర్చినప్పుడు మనసు మాట విన్నట్టు గుర్తు కాని ఇప్పుడు గమ్యంలేని పయనం వైపు పరిగెడుతున్నాయి. ఈ అడుగులకు మరెన్నో అడుగులు జతకడుతున్నాయి,మాట్లాడుతున్నాయి మమతలు మరచిన పరిమిత మాటల్ని. ఎన్ని బండ శిలలను తొక్కితొక్కి మొద్దుబారిపోయాయో ! స్పర్శను కోల్పోయాయి ఒక్కోసారి ఈ అడుగుల కింద రాగద్వేషాలు నలగబడుతున్నాయి. వీటికి ఎండిన గుండెబాధ తెలీదు నిండిన కన్నీటి గాధలు తెలియవు దారుల్లో ముళ్ళు మొలిచి గుచ్చుతున్నా అవి చేరే స్వార్ధపు తీరాలవైపు నడుస్తూనేవున్నాయి. అవిగో చేరుకున్నాయి ప్రేమ రాహిత్య శిఖరపు అంచులకు కానీ అక్కడ స్వచ్చమైన ప్రేమ పంచే పాదాలు లేవు సూన్యం తప్ప ! (16-02-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDKO4J
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDKO4J
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి