పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Ramabrahmam Varanasi కవిత

మేధావులు వారణాసి రామబ్రహ్మం 16-2-2014 సంఘాన్ని మేధావులు నడుపుతారు. ఇప్పుడు భారత దేశంలో మేధావుల సంఖ్య చాలా పెరిగిపోయింది. ప్రతి కులానికి, మతానికి,ప్రాంతానికి, సిద్ధాంతానికి, రాద్ధాంతానికి, దేనికి అయినా సరే, ఒక సమూహం ఏర్పడుతోంది. సమూహం మిగతా సమూహాలని చీల్చి చెండాడుతోంది. అలా ఒకరితో ఒకరు పోట్లాడు కొనే మేధావుల వల్ల సంఘములో శాంతి సుఖములు కరవు అయిపోయాయి. ప్రతి మేధావుల సమూహము వెనుకా కొందరు రౌడీలు; అసాంఘిక శక్తులు దన్నుగా నిలిచి గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో, సిద్ధాంతాన్నో మాత్రమె వెనకేసికొని రావడమే మేధావితనముగా చెలామణీ అవుతున్న ఈ వేళ అందరూ మేధావులే; చెప్పేవాళ్ళే. ఆచరించేవాళ్ళు సున్నా. న్యాయము, ధర్మము సూక్ష్మమైనవి. కులము, మతము, ప్రాంతము, సిద్ధాంతము ముసుగులో, కళ్ళతో చూసే వారు "మేధావులు" కారు; సంఘములో ప్రజల మధ్య వైషమ్యాలు, వైమనస్యాలు సృష్టించడము తప్ప మరేమీ సాధించలేరు. అందర్నీ "సాధిస్తూ", తిడుతూ, తీసిపారేస్తూ, మేధావులుగా పేరు ప్రతిష్టలు సంపాదించి, సంఘాన్ని అతలాకుతలం చేసి నెమ్మదిగా ప్రకృతిలో కలిసిపోతారు. ప్రజలు మాత్రము ఈ మేధావులు సృష్టించి, పోషించిన వైషమ్యములతో కొట్టుకుచస్తూ అలమటిస్తూంటారు. ప్రస్తుతపు మేధావి తనము సంఘానికి తలనొప్పి గా తయారైంది . హృదయాలని శాశ్వతముగా విడదీస్తోంది. సమన్వయము హుళక్కి. సమన్వయము లేక శాంతి సుఖములు లేవు. అందరూ మేధావులే. శాంతి సౌఖ్యములకే లోటు.

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dyLPdc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి