అమ్మా నాన్న వెక్కి వెక్కి ఎడుస్తున్నారు
వూళ్ళో జనమంతా ఎడ్లకొట్టం ముందు మూగి మాట్లాడుతుంది
పొద్దునార్పిన పొయ్యు మళ్ళీ వెలిగించలేదు
ఏడేళ్ళు పనిజేసి ఎత్తుబడి మెత్తబడ్డప్పుడు
నాన్న పెద్దెద్దును ప్రతిరోజు పొద్దిన్నే
కర్రలతో లేపి కడిగేవారు
గడ్డిని పేర్చి పక్కమార్చే వారు
ఎత్తుపీటేసుకొని ఎప్పుడూ పక్కనే కూర్చునేవాడు
కాకులకు కాపలా కాస్తూ
పుండు బడ్డచోట పొడుస్తాయేమోనని
ఎందరు పాలేర్లున్నా తన చేతుల్తో
తానే దానా తినిపించేవాడు
గంగడోలును గోకి
గంపెడు ప్రేమను పంచేవాడు
వలపటయునా దాపటయునా
ఒకేలా పనిచేస్తుందని
వచ్చే పోయేవాళ్ళకు
వాశ్చల్యంతో చెప్పే వాడు
నాన్న అమ్మా పొద్దున్నుంచ్చి ఎడుస్తూనే ఉన్నారు
పెద్దెద్దు చనిపోయుందని వోదార్చేవాళ్ళు వోదారుస్తూనే వున్నారు
నాగా పెట్టకుండా నాగలి దున్నిందని
నాతో సమానంగా నా సంసారం లాగిందని
తనమాట వినగానే తనంత తానే కాణీ మెడకెత్తుకొవటం
గుర్తు తెచ్చుకొని గొంతు పూడుకు పోతున్న నాన మాటలు వినిపిస్తూనే వున్నాయు
పసుపూ కుంకుమ చల్లి ఊరంతా ఊరేగించి
ఉప్పుపాతరేస్తున్నప్పుడు
ఏడ్చి ఏడ్చి చితనిప్పు లయున
నాన్న కళ్ళు నాకింకా గుర్తే
అనుబందాలు అరుదవుతున్న సందర్భంలో
ఏడ్చిన నాన్న కళ్ళు ఏకొందరికన్నా ఇంగిత మిస్తే బాగు
*12-08-2012
నిజమే !
రిప్లయితొలగించండిఅనుబంధాన్ని తెంచుకోవడం బాధగానేవుంటుంది
కొన్నిసార్లు
అనునిత్యం చేతిస్పర్శను పొదుతూ పెరిగిన పెంపుడు జంతువులు జీవితానికి ధైర్యానిస్తాయి.
బాగా చెప్పారు.
***
అక్కడక్కడ అక్షరదోషాలున్నాయి(టైపోగ్రఫికల్ ఎర్రర్స్) చూడండి