పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జులై 2012, ఆదివారం

కసి రాజు॥మళ్ళెప్పుడొస్తావ్?॥

మబ్బుపట్టిన మొహమేసుకుని
మసక సూపులు సూత్తావ్
వానలా వత్తానని
వరదై ముంచెత్తుతావ్
కరిగించేత్తావ్
కదిలించేత్తావ్
కొట్టుకుపొయేట్టు చేత్తావ్
ఒక్కోసారి మొలకెత్తిస్తావ్, పులకెత్తిస్తావ్
పూయనిస్తావ్,కాయనిస్తావ్
అన్నీ ఇచ్చి అస్తమిస్తావ్
ఏడాదికోసారి ఉన్నానంటూ ఉదయిస్తావ్.
మళ్ళెప్పుడొసావ్?
*******
వాతావరణ కేద్రం హెచ్చరికలు జారీ
ఈ రాత్రికి ఋతు పవనాలు ఎటో దారి మళ్ళాయి
*21.7.2012

1 కామెంట్‌:

  1. వాన అల్లరిని ..ఒక్కోసారి అది చేసే ఆత్యంత బీభత్సాన్ని చాలా కసిగా చెప్పారు రాజు గారూ!సత్వర స్పందనకు బహుథా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి