పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, జులై 2012, బుధవారం

రమేష్ హజారి॥రేపటి కొరకు॥

నీ ప్రతీ జాడ వేకువ గాలై నాలో ఆశల వూపిరిలూదేది
నీ మంచు కడ్గపు చూపు పదునుకు నా ప్రేమ చెలిమ తొవ్వ కుండానే వూటలూరేది
నీ అలౌకిక స్పర్శ నా పంచేంద్రియాలను కబ్జా చేసి నాకు పంచామ్రుతాన్ని పంచేది
నీ ఎడబాటుకు బెదిరి నీ అరచేయి రేఖనయి నీలో నే ముడుచుకు పోయేది
నీ ప్రేమామృతాన్ని పొందేందుకు నా హృదయ సముద్రాన్ని మదించాను
అమృతము నాకొదిలి హాలాహలాన్ని స్వీకరించావు 

హిందూ మహాసముద్రపు సునామీలో కొట్టుక పోతున్న విలువలను వడిసిపట్టేలోపే
నా మీద ప్రేమతో నీవు విధించిన జీవిత కాలపు శిక్షను శిలారూపమయి భరిస్తాను
ప్రాణమా..గతం జ్ఞాపకమయి వర్తమానాన్ని కొరుక్కు తింటుంటే
మరణమే లేని నీ రూపాన్ని.నా మదిలో రేపటి కొరకు దాచిపెడుతా.
*24.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి