పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఏప్రిల్ 2014, మంగళవారం

Satya NeelaHamsa కవిత

సమాలోచన ^^^^^^^^^^^^ -సత్య వాగే నీ వెధవ వాగుడు వింపించాలనే నీ పిచ్చి, నీ ఒంటరితనానికి పరాకాష్ఠ! నీకింకా అర్థం కావట్లేదా? జనాలు పూసుకుంటున్న జండూ బాం తక్కువుందనా? నీ బాధలు కూడా జనాలపై జోరుగా రుద్దు తున్నావు? అంగట్లో ఆత్మాభిమానాలు తక్కువున్నాయనా ? నీ అస్తిత్వాన్ని కూడా అందరికీ గుర్తుచేస్తూ తిరుగుతున్నావు! సహజంగా సరళంగా , సమాలోచన చేసుకోలేని సమాదిలో గడపలేని , నీ సాధుత్వం దేనికని? ఉషోదయాన్ని శీతలఝరాన్ని పరిమళపవన్నాన్ని మర్చిపోయావా ? లేక నువ్వే, గుర్తుచేసుకోవా ? మును ముందుకు సాగిపోయే వాడివి నీవని మరిచిపోయవా? దారిలో కలిసేవారు దరిని చేర్చేవారు వేర్వేరని గుర్తుచేయాలా? అవలోకనం విమర్శ ఉద్ధరణ పదాలు ఆత్మకంటించాలంటే కరడుగట్టిన కరగని అహం అహరహం అడ్డోస్తుందా ? మౌనమిచ్చిన ముత్యాల్ని మాటల మూటళ్లో కట్టి మందిలోజేరి "మంచిగా" అమ్ముతున్నావా ? మధువు దోచి మూటకట్టే తుమ్మెదలాగా సహజంగా బతికి నీపనేదో నువ్‌చేసుక్కొని చావరాదా? లేక చావడంకూడా రాదా? అందరూ వెతికేలా నీ అడుగుజాడలొదలాలని ఆర్భాటంతో అంతుచిక్కని నీ ఆత్రుత దేనికని? స్నేహంగా ఉంటావో, స్నేహంగా కనిపిస్తావో! నీ చిరునవ్వు ముసుగుని ఎవరికి చూపిస్తావో!! నీవు లేని దారుల్లో నిన్నునీవు వెతుకుతున్నావ్! శృతిలేని నీసంగతుల మధ్య సంగీతం రావట్లేదా? జరిగేదిదే, ఎందుకు బెట్టుకు పోతావు ? జనాలతో పెట్టుకోకు కొట్టుకు పోతావు ? -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1enNwqP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి