పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

శూన్యత || పూర్ణిమా సిరి||

శూన్యం లో ఏమీ ఉండవనీ
ఏమీ ఉండకుంటే అది శూన్యమని
నిర్వచించిన వాళ్ళని ఏమనాలి
అది నిజమే అనుకోని
నిర్లిప్తంగా ఉన్న నన్నేమనుకోవాలి

ఒక్కోసారి అదే శూన్యం

అనంతాలకు దగ్గరి దారిలా
మనలోకి మనని తీసుకెళ్ళే
స్వయంనిర్మిత పుష్పక విమానం లా
ఒక వింతలా ,విభ్రాంతిలా
ఎన్నో అలసటలను తీర్చే విశ్రాంతిలా

మరిప్పుడు అదే శూన్యం

ఒక జ్ణాన సరస్వతిలా
ఒక్కో అక్షరం మళ్ళీ నేర్పిస్తూ..
అమ్మలా లాలిస్తూ..
నేస్తం లా ఓదారుస్తూ..
నాలోకి నన్ను ప్రవహింపజేస్తూ..

హ్మ్! అందుకే అప్పుడప్పుడూ

ఖాళీ తనం కూడా
కావాల్సినతనమే...

5.9.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి