అడవి బిడ్డలం _______________కృష్ణ మణి అయ్యా దొరలూ ! అడవి బిడ్డలం ఆకలేస్తే అడివమ్మ పెడుతది ఎంగిలి ఎప్పుడన్న అడిగినమా కడుపులెండినాయని ఎన్నడన్న చెయ్యి జాపినమా ? మనషుల్ని ముంచుడు మీకలవాటేమో కోటక్క జీవరాశేమ్మన్నది ? తేనెపట్టు దోషినమని దొంగలమా ? విప్పపువ్వు ఎరినమని ఎక్కిరింపులా ? అడవి జాతర్లో ఆది బిడ్డలం నాగరికత మీదైతే జులూమా ? అనాగారికులమైనా మనసున్నోళ్ళం ! తీరొక్క జీవాలను బొందబెడతరా ? సిగ్గు శెరం లేదా ? ఊరవతల గుడిసేలేసుకోవలనా ? మీ బిచ్చానికి చాటబట్టాలెనా ? మమ్ముల ముంచి గింజలు పండిస్తరా ? ఆకలైతే అడుక్కోవాలెనా ? మీ అయ్యల జాగిరెమ్మన్నా మా అయ్యలకిచ్చినరా ? లేక అప్పు రాసుకున్నరా ? రాముడు మా దేవుడన్నరు ఇందుకేనా ? మీతోనే ఉంటామని మూసుకున్నం అప్పుడు నమ్మినోన్ని నట్టేట్ల ముంచుడమేనా మీ నీతి ? ఆకులలాలు తినుకుంట మంచిగున్నం మా ఉసురు తీయకున్డ్రి నోరుందని అడుగుతున్నం నోరు లేని అమాయకపు కన్నులకేమి తెలుసు బతికేది మూన్నాలని ! అడుగుతున్నం కాళ్ళకు మొక్కి కనికరముంచమని కసాయిగా నడుస్తే బుల్డోజర్ల కింద పండుతం మా బిడ్డల కోసం ఆ జీవుల కోసం మా జీవినిస్తం ! అడవి వేటలో అడుగు తెల్సినొళ్ళం అయితదేమో కాని కొత్త ‘అవతార్’ మొదలైతది మాటలేకున్న రోషముంది ! 30-05-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPF0al
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPF0al
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి